కేసీఆర్‌ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్

61
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు.

నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ గారి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.కాగా బేగం పేటకు ప్రత్యేక విమానం లో చేరుకున్న సీఎం జగన్ ను…మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆహ్వానించారు.సీఎం జగన్ వెంట ఎంపీ మితున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.

Also Read:రాహుల్‌ని ప్రధాని చేస్తాం:షర్మిల

- Advertisement -