17లోగా అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి..

58
- Advertisement -

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారకాస్తుల డాటా ఎంట్రీ లపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామపంచాయితీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు.

ఈనెల 6 వతేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. మండల రెవిన్యూ అధికారులు, మండల డెవలప్ మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డాటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు.

Also Read:బూట్‌ కట్ బాలరాజు..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -