ఓ ప్రగతి, ఓ సురేఖా వాణికే ఎందుకు ఇలా?

34
- Advertisement -

వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటి ‘ప్రగతి’ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూనే ఉంది. దీనికితోడు నటిగా స్టార్ డమ్ కంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చుతూ పాపులారిటీ కోసం తెగ కిందామీదా పడుతుంది ప్రగతి. టాలీవుడ్ లో హీరోయిన్లు అందరూ తమ అందాల పురోగతి ఇది అంటూ రోజుకొకసారి డ్రెస్ విప్పేసి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారని.. ఇలా చాలామంది హీరోయిన్ లు చేస్తున్నారని.. అలాగే కొందరు హీరోయిన్లు మీడియాకి విడుదల బైట్స్ లలో కూడా షార్టులు వేసుకొని దర్శనం ఇస్తున్నారని.. మరి అలాంటప్పుడు ఒక ప్రగతి, లేకపోతే ఓ సురేఖా వాణి లాంటి వారు మాత్రం ఎందుకు ఎక్స్ పోజింగ్ చేయకూడదు అంటూ మాట్లాడుతుంది.

అలాగే నటి ప్రగతి నుంచి మరో ఆరోపణ ఏమిటంటే… ప్రగతి మాటల్లోనే.. ‘బికినీల్లో అందాలన్నీ చూపిస్తున్న ఈ హీరోయిన్లను ఎవరూ ప్రశ్నించరు, వాళ్ళు ఏమి చేసినా రైట్. అదే మేము పొట్టి స్కర్ట్ లు వేసుకున్నా… బీచుల్లో బికినీతో కనిపించినా అశ్లీలత అంటారెందుకని ?” అంటూ కాస్త గట్టిగా ప్రశ్నిస్తోంది నటి ప్రగతి. మరి ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఈ ప్రశ్నలు ఎందుకో ప్రగతికే తెలియాలి. అయినా ప్రగతి బికినీ వేసినా వేయకపోయినా అడిగేవారు లేరు అనే ఆమె బాధ అంటూ.. కాస్త ఆమెను కూడా పట్టించుకోండి అంటూ నెటిజన్లు నటి ప్రగతి పై అప్పుడే జోక్స్ కూడా వేస్తున్నారు.

ఇక నటిగా ప్రగతి కెరీర్ విషయానికి వస్తే.. మొద‌ట టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స‌త్తా చూపిన ఈ ముదురు ముద్దు గుమ్మ,‌ మొత్తానికి లేటు వయసులో కూడా హాట్ బ్యూటీ అనిపించుకోవడానికి ప్రస్తుతం తెగ తాపత్రయ పడుతుంది. ఇక చాలాకాలంగా ప్రగతి ఓ నిర్మాతతో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం పై ఆ మధ్య ఓ మీడియా ప్రతినిధి అడిగితే.. ఈ రోజుల్లో ఇలాంటివి కూడా అడుగుతారా ?, కామన్ విషయాలను కూడా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు ? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇది ప్రగతి పరిస్థితి.

Also Read:తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

- Advertisement -