44 ఏళ్ల హీరోకి జోడీగా 18 ఏళ్ల భామ‌

39
- Advertisement -

బాల న‌టిగా తెరంగేట్రం చేసిన ‘సారా అర్జున్‌’ సుప‌రిచిత‌మే. విక్రమ్‌ హీరోగా 2011లో వచ్చిన ‘నాన్న’ సినిమాతో బాల న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో విక్రమ్‌ కూతురిగా నటించిన ‘సారా అర్జున్‌’ నటనను అందరూ ఫిదా అయ్యారు. అంత చిన్న వయసులోనే తన యాక్టింగ్‌తో సారా అదరగొట్టింది. పైగా ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’లో కూడా సారా అర్జున్‌.. ఐశ్వర్యా రాయ్‌ చిన్నప్పటి పాత్ర పోషించి.. సినిమాలోనే హైలైట్ గా నిలిచింది. ఒక కమర్షియల్ హీరోయిన్‌కు ఉండాల్సిన అందం, అభినయం ఆమెలో ఫుల్ గా ఉన్నాయి.

దీనికితోడు ‘సారా అర్జున్‌’ హీరోయిన్ గా కూడా ఇటీవ‌ల ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. నేనింకా చిన్న పిల్ల‌ను అనుకుంటే మీ భ్ర‌మ ..నేను పెద్ద‌దాన్ని అయ్యాను… తనకు హీరోయిన్ వ‌య‌సు వ‌చ్చేసిందంటూ ఇన్ స్టా వేదిక‌గా ‘సారా అర్జున్‌’ షేర్ చేస్తోన్న ఫోటోల్ని చూస్తుంటే.. అమ్మడు భామా మాణిగా మారిపోయింద‌ని తెలిపోయింది. అయితే ఇప్పుడీ 18 ఏళ్ల భామ ఏకంగా 44 ఏళ్ల గోపీచంద్ తో రొమాన్స్ కి రెడీ చేసిందా? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ క‌థానాయ‌కుడుగా దర్శకుడు శ్రీను వైట్ల చేస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా మరో హీరోయిన్ న‌టిస్తోంది. అయితే ఇందులో ‘సారా అర్జున్‌’ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆ పాత్ర లో కాస్త నెగిటివ్ ట‌చ్ ఉంటుందట‌. ఓ స‌న్నివేశంలో భాగంగా గోపీచంద్ తో కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘సారా అర్జున్‌’ న‌టించింద‌ని మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. సీన్ డిమాండ్ చేయ‌డంతోనే హీరో గోపీచంద్ ఆ స‌న్నివేశాన్ని సినిమాలో పెట్టిన‌ట్లు వినిపిస్తుంది. సాధార‌ణంగా గోపీచంద్ సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాల‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. క్లీన్ అండ్ నీట్ గా అత‌ని సినిమా లుంటాయి. కానీ ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ టచ్ ఉంటుందట.

Also Read:బాబు ప్లాన్.. ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరు?

- Advertisement -