చిరంజీవితో మామూలుగా ఉండదు అట

59
- Advertisement -

కెరీర్‌ ఆరంభం నుంచి కూడా కమర్షియల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న దర్శకుడు శైలేష్ కొలను. ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో కలిసి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గత రెండు మూడు వారాలుగా శైలేష్ కొలను ప్రమోషన్స్ లో జోరు చూపిస్తూ ఉన్నాడు. సంక్రాంతికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో తమ సినిమా ఆ సినిమాలకు ఏమాత్రం తీసి పోదు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ శైలేష్ కొలను సైంధవ్ ను జనాల్లోకి తీసుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో తన తదుపరి సినిమాలు ఇతర విషయాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి దర్శకుడు శైలేష్ కొలను స్పందించాడు. తాను మెగాస్టార్ గారికి స్టోరీ లైన్‌ చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆ లైన్‌ చిరంజీవి కు నచ్చిందని కూడా దర్శకుడు శైలేష్ కొలను పేర్కొన్నాడు. ముందు ముందు ఆ ప్రాజెక్ట్‌ పై క్లారిటీ ఇస్తాను అన్నాడు. మెగాస్టార్ ఎప్పుడు కాల్‌ చేసి స్క్రిప్ట్‌ రెడీ చేయమంటే అప్పుడు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. మెగాస్టార్ తో తాను చేయబోతున్న సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో రాని కాన్సెప్ట్‌ అంటూ ఫ్యాన్స్ ను శైలేష్ కొలను ఊరిస్తున్నాడు.

మరి, అంతటి స్పెషల్‌ కాన్సెప్ట్‌ ఏంటో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. విభిన్న దర్శకుడిగా శైలేష్ కొలను కు మంచి పేరు ఉంది. తాను తీసిన హిట్, హిట్: ది ఫస్ట్ కేస్ (హిందీ తెలుగు సినిమా హిట్ రీమేక్), అలాగే హిట్ 2: ద సెకెండ్ కేస్ మంచి విజయాలను అందుకున్నాయి. మొత్తానికి మెగాస్టార్ తో మరి ఈ హిట్ దర్శకుడు ఏ రేంజ్ హిట్ సాధిస్తాడో చూడాలి.

Also Read:TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -