పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి గత కొద్ది రోజులుగా ఓ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలోకి జనవరి 12నే వచ్చేస్తుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. మంచి వసూళ్లు రాబడుతున్న సలార్ జనవరి చివరి వారంలో మాత్రం ఓటీటీలోకి రాదని సమాచారం.
ఇక మరో క్రేజీ సినిమా విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ జనవరి మూడు లేదా నాలుగో వారంలో స్ట్రీమింగ్ చేయాలనుకుంది. తాజాగా ఆ అభిప్రాయాన్ని మార్చుకొని.. జనవరి 5 నుంచే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే, అందాల తార హన్సిక ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ `మై నేమ్ ఈజ్ శృతి`. ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీశర్మ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.
Also Read:కాళేశ్వరంపై కాంగ్రెస్..ఎందుకిలా?