దరఖాస్తు ఒకటి.. ప్రశ్నలు ఎన్నో ?

25
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల అమలు డిష్గా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరు హామీల లభ్ది పొందేందుకు ప్రజలు ఎలాంటి గందరగోళానికి లోనవకుండా అన్నిటికీ ఒకే దరఖాస్తు ద్వారా అప్లై చేసుకునే వీలు కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. నిన్నటి నుంచి ప్రజపాలనలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు ఒకటే అయినప్పటికి ఎన్నో ప్రశ్నలు ప్రజలను చుట్టుముడుతున్నాయి. దరఖాస్తు ఫారంతో పాటు అర్హులైన వారు ఏ ఏ డాక్యుమెంట్స్ సడ్మిట్ చేయాలనే దానిపై చాలా మందిలో కన్ఫ్యూజన్ నెలకొంది. రేషన్ కార్డ్ ప్రామాణికంగా ఉన్నప్పటికి ఆదార్ కార్డ్ కూడా జత చేయాల్సి ఉంటుంది. .

వీటితో పాటు క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా జత చేయాలా లేదా అనేదే అసలు ప్రశ్న. అయితే రేషన్ కార్డ్, ఆధార్ ఉంటే చాలని ఇన్కమ్ క్యాస్ట్ డాక్యుమెంట్ అవసరం లేదని చెబుతున్నారు అధికారులు. ఇక ఈ ప్రశ్నలతో పౌట్ మరికొన్ని ప్రశ్నలు కూడా ప్రజలను తొలచివేస్తున్నాయి. రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దరఖాస్తు ఫారంలో బ్యాంక్ వివరాలు ఇవ్వలేదు. దీంతో నగదు ఎలా జమచేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మహిళలకు రూ. 2,500 ఇచ్చే విషయంలో కూడా ఇంట్లో అందరి మహిళకు ఇస్తారా లేదా ఒక్కరికే ఇస్తారా ? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. రూ.500 లకే గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విషయంలో ఎన్ని సిలిండర్లకు ఇస్తారనేది కూడా దరఖాస్తు ఫారంలో లేదు. దీంతో ప్రజలు ఆరు గ్యారెంటీ హామీల విషయంలో గందరగోళానికి లోనవుతున్నారు. మరి ప్రజల్లో లేనకొన్న ఈ కన్ఫ్యూజన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Also Read:కిస్మత్‌..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -