ప‌ది రోజుల త‌ర్వాతే దేవర మొదలు

35
- Advertisement -

‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ కోసం జ‌పాన్‌ వెళ్లారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో భార్య ప్రణీత, కుమారులు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌తో క‌లిసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవ‌ర‌. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత వారం వరకు శ‌ర‌వేగంగా జరిగింది. ముఖ్యంగా గోవాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోవ‌డంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. తిరిగి ప‌ది రోజుల త‌ర్వాత ఇండియా వ‌చ్చి షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

ఇక వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్ర‌కారం, దేవ‌రకు సంబంధించిన గ్లింప్స్ ను జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. ‘దేవ‌ర’ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర చేస్తుంద‌ని, జనవరి 24 నుంచి దేవ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ డేట్స్ అడ్జ‌స్ట్ చేసింద‌ని స‌మాచారం. ఇంతకీ, రమ్యకృష్ణ పాత్ర ఏమిటో తెలుసా ?, ఓ వేశ్యగా ఆమె నటిస్తోందట. విలన్ సైఫ్ అలీఖాన్ సరసన రమ్యకృష్ణ పాత్ర సాగుతుందని తెలుస్తోంది.

కాగా ‘దేవర’ సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది. అన్నట్టు రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దేవర రెండో పార్ట్ ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచే షూటింగ్ చేస్తారట.

Also Read:Dil Raju:శిల్పక‌ళావేదిక‌లో సిల్వ‌ర్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్‌

- Advertisement -