కేంద్రమంత్రి అనిల్ మాధవ్ ధవే కన్నుమూశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ధవే కేంద్రపర్యావరణ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. మాధవ్ ధవే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఎయిమ్స్‌లో చికిత్స పొందుతు మృతి చెందారు.ఆయన నర్మదా నది పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ లో జన్మించిన ఆయన, ఇండోర్ లోని గుజరాతీ కాలేజీ నుంచి ఎంకామ్ విద్యను అభ్యసించి, ఆపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరి రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు.హిందీలో అనేక గ్రంథాలు రాశారు.. 2009లో తొలిసారి రాజ్యసభకు ఎంపికైన ఆయన, నీటి వనరుల కమిటీ, సమాచార, ప్రసారాల శాఖ కమిటీ, వాతావరణ మార్పులపై అధ్యయన కమిటీ సహా పలు కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. గత సంవత్సరం జూలై 5న నరేంద్ర మోదీ, తన క్యాబినెట్ ను విస్తరించగా, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా దవే బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Absolutely shocked by the sudden demise of my friend & a very respected colleague, Environment Minister Anil Madhav Dave ji. My condolences.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
I was with Anil Madhav Dave ji till late last evening, discussing key policy issues. This demise is a personal loss.
— Narendra Modi (@narendramodi) May 18, 2017