ఐదారేళ్ల క్రితం వరకు తల్లి పాత్రల్లో నటించేందుకు హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడు అగ్రతారలు సైతం వెండితెరపై అమ్మగా కనిపించేందుకు ముందుకొస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇమైక్క నొడిగల్’ చిత్రంలో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది.
థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్గా నటిస్తుండడం విశేషం. డైరెక్టర్ గా హిందీలో బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి, గులాల్ వంటి సినిమాలు తీశారు. రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేశారు. నటుడిగా మాత్రం ఇలా తెరపై సెకన్ల పాటూ కనిపించే అతిధి పాత్రలు తప్ప పెద్దగా ఏ సినిమాలోనూ నటించలేదు. మొదటిసారి తమిళ సినిమాలో ముఖ్య రోల్ చేస్తున్నారు.
ఇది సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా. నయనతార హీరోయిన్ గా, అధర్వ హీరోగా చేస్తున్నారు. రాశీఖన్నా మరో ముఖ్య పాత్ర చేస్తోంది. కాగా నయన తార ఇందులో నాలుగేళ్ల పిల్లకి తల్లిగా పూర్తి స్థాయి రోల్ లో కనిపిస్తుంది.
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే అధిక ప్రాముఖ్యతనిస్తుండడంతో కథాబలాన్ని బట్టి అమ్మ పాత్రల్లో నటించేందుకు ఆమెకు సంసిద్ధంగా ఉంది. గతంలో కూడా ఆమె ఓ బాబుకి తల్లిగా తులసి సినిమాలో నటించింది. మయూరి సినిమాలో కూడా పసిబిడ్డకి తల్లిగా కనిపించింది మిగతా స్టార్ హీరోయిన్లెవరు ఇంత రిస్క్ తీసుకోవడంలేదు. నయన్ ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమా వైపే మొగ్గుచూపుతోంది. అందులోనూ థ్రిల్లర్, హారర్ సినిమాలను చేయడానికి ఇష్టపడుతోంది. ఆ సినిమాలలో డీ గ్లామర్ గా కనిపించడానికి కూడా సిద్ధమైపోతోంది. మయూరి సినిమా తరువాత ఆమె డోర అనే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మూవీలో నటించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతోనే ముందుకొస్తుంది.