హైదరాబాద్ బిర్యానీలా..‘రాఘవ రెడ్డి’

39
- Advertisement -

శివ కంఠనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ, డైరెక్టర్ నీలకంఠ, మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేష్, సుచర్ ఇండియా కిరణ్, వరా ముళ్లపూడి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా…సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ ‘‘‘రాఘవ రెడ్డి’ ట్రైలర్ చూడగానే మసాలాలు అన్ని దట్టించి తయారు చేసిన హైదరాబాద్ బిర్యానీలాగా అనిపించింది. ట్రైలర్ చూడగానే కథ, బ్యాగ్రౌండ్ ఏంటనేది అర్థమవుతుంది. హీరో శివ కంఠమనేని చాలా చక్కగా ఉన్నారు. మంచి పేరు వస్తుంది. ఆయన గత చిత్రం మధురపూడి గ్రామం అనే నేను సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. దానికి బెస్ట్ మూవీ అవార్డు రావాలని అనుకుంటన్నాను. మంచి కాస్ట్ అండ్ క్రూతో చేసిన సినిమా. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ ‘‘ ఇంతకు ముందు చేసిన మధురపూడి గ్రామం అనే నేను చిత్రంలో రగ్డ్ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో సిన్సియర్, స్ట్రిట్ ప్రొఫెసర్ గా నటించాను. రాశిగారు, నందితా శ్వేత కీలక పాత్రల్లో నటించారు. ఇంకా రఘుబాబు, పోసాని, అజయ్, అజయ్ ఘోష్ సహా చాలా మంది నటించారు. చక్కటి విందు భోజనంలా నవ రసాలున్న సినిమా. తప్పకుండా సినిమా అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

Also Read:ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం..

- Advertisement -