ఆ సినీ రచయిత మాట నేటికీ గొప్పదే

34
- Advertisement -

ప్రపంచంలో ఇప్పుడంతా డబ్బు మయం అయిపోయింది, కానీ.. జీవితపు ప్రతి క్షణాన్నీ డబ్బుతో కొలవకూడదు, ఆనందాన్ని వెతుక్కోవాలి అని అలనాటి మేటి రచయిత ఆత్రేయ చెబుతూ ఉండేవారు. మేటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయ రాసే సినిమా పాటకి రాగం అక్కర్లేదు అన్నారు, ఆత్రేయ గారేమో ఎంత అవసరమో, సన్నివేశాన్ని బట్టి అంతే ఉంచాలన్నారు. సరే, ఎక్కడ రాగం ఉండాలి, ఎక్కడ భావం ఉండాలి అన్న విషయాన్ని మీరు నటించి గానం చేస్తూ చెప్పామన్నారు ఆదుర్తి. భక్త పోతన సినిమాలో ”ఎవ్వనిచే జనించు ఎవ్వని లోపల లీనమై” అన్న పద్యాన్ని ఆత్రేయ సెటైరికల్ గా పాడి లేచి వెళ్లిపోయారు. ఇక అంతే.. ఆ సినిమాకి మళ్లీ ఆత్రేయ పాటలు రాయలేదు. బోలెడు డబ్బులు ఇస్తాం వచ్చి పాట రాయవయ్యా అని ఆదుర్తి గారు ఎన్నిసార్లు కబురంటినా ఆత్రేయ గారు మాత్రం పాడిన పాటనే పాడి వినిపించేవారట.

ఇదంతా గమనించిన ఓ సీనియర్ నటుడు ‘ఏమిటి గురువు రావు ?, మీరు డబ్బును వదులుకోరు కదా ?, ఎందుకు బెట్టు చేస్తున్నారు ? అని అడిగారు. అప్పుడు ఆత్రేయ గారు చెప్పిన మాటే.. ప్రతి క్షణం జీవితాన్ని డబ్బుతో కొలవకూడదురా, కళాదృష్టితో కూడా కొలవాలి” అని. ఆ నటుడు మనసు ఒక్కసారిగా ఆత్రేయ గారి పై పొంగిపొర్లింది. అప్పటి నుంచే ఆత్రేయ గారు ‘ఏం మాట్లాడినా అందులో అర్ధం ఉంటుంది’ అని ఆ నటుడు బలంగా నమ్మే వారు. ఆ నటుడు పేరు రావు గోపాలరావు. రావు గోపాలరావుకి ఆత్రేయతో మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే ఆయన ఆత్రేయను తరుచూ కలుస్తుండేవారు. అది 1989, ఆత్రేయ గారి చివరి రోజుల్లో.. గోపాలరావు కష్టపడి ఆత్రేయ గారిని చూడటానికి వెళ్లారు. ఎంతో గంభీరంగా కనిపించే ఆత్రేయ, అలా మంచానికే పరిమితం అవడంతో గోపాలరావు తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకొని, ఆత్రేయ గారి చేతులు పట్టుకొని ”ఏడుస్తూ” ఆలింగనం చేసుకుని అక్కడి నుంచి వచ్చేశారు. కానీ, ఆత్రేయ గారు చెప్పిన ‘జీవితపు ప్రతి క్షణాన్నీ డబ్బుతో కొలవకూడదు, ఆనందాన్ని వెతుక్కోవాలి’ అనే మాటను మాత్రం తన జీవితాంతం పాటించారు. నేటి యువత కూడా ఈ మాటను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తే జీవితం బాగుంటుంది కదూ.

Also Read:పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము

- Advertisement -