- Advertisement -
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించినట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఇస్తున్నామని…పబ్‌లు,రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి సీపీ వెల్లడించారు.
10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని…ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు.ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ,ట్రాఫిక్ గార్డులు ఉండాలని..పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం అన్నారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దని…డ్రగ్స్, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయకూడదని..డ్రంక్ & డ్రైవ్‌లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read:పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము
- Advertisement -