విజువల్ వండర్.. ‘హను-మాన్’

38
- Advertisement -

ఒరిజినల్ సూపర్ హీరో ‘హను-మాన్’ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ మాగ్నమ్ ఓపస్ ‘హను-మాన్’ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అఖండ భారతంలోని ఇతిహాసాల నుండి ప్రేరణ పొందిన ట్రైలర్ లోని మొదటి ఫ్రేమ్ మనల్ని ఫాంటసీ యూనివర్స్ అంజనాద్రి లోకి తీసుకువెళుతుంది. అండర్ వాటర్ సీక్వెన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ‘యథో ధర్మ తతో హనుమా… యథో హనుమ తతో జయ… (ధర్మం ఉన్నచోట హనుమంతుడు వుంటారు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది) అనే శ్లోకంతో నక్షత్రంలా మెరుస్తున్న ముత్యపు చిప్పకు దగ్గరగా కథానాయకుడు వెళుతున్నట్లు అద్భుతంగా ప్రజంట్ చేశారు.

అంజనాద్రి నిజమైన అందం జలధార గల హనుమాన్ పర్వత శ్రేణిలో వుంది. అక్కడ భారీ హనుమాన్ విగ్రహం మహా అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో రఘునందన శ్లోకం గూస్‌బంప్స్ తెప్పించింది. కథానాయకుడు చిరుతతో పాటు పరిగెత్తడం, కొండను ఎత్తడం విలన్ ని కొట్టే యాక్షన్ దృశ్యాలు సూపర్ పవర్ తో అద్భుతంగా వున్నాయి. తర్వాత సైన్స్ సహాయంతో సూపర్ పవర్‌లను కనిపెట్టిన యాంటీహీరో వస్తాడు. తనని ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చేసే పవర్ కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. తన రాకతో ప్రతిదీ నాశనం చేస్తాడు, పిల్లలను కూడా విడిచిపెట్టడు. హీరోపై కూడా క్రూరంగా దాడి చేస్తారు. ధర్మాన్ని చీకటి కమ్మినపుడు, పూర్వీకులు మళ్లీ వస్తారు. చివరకు హనుమంతుని అద్భుత దర్శనం జరుగుతుంది. టీజర్‌లో హనుమంతుడు ఐస్ క్యూబ్‌లో శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు చూపించగా, దానిని పగలగొట్టి, ధర్మాన్ని రక్షించడానికి బయటకు వస్తారని ట్రైలర్‌ సూచిస్తోంది. నెక్స్ట్ లెవల్ ఎలిమెంట్స్ తోగూస్‌బంప్స్ తెప్పించింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ కృషి ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో కనిపించింది. అద్భుతమైన యునివర్స్ ని సృష్టించి, పాత్రలతో పాటు మనల్ని ప్రయాణించేలా చేసి విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. సైన్స్ వర్సెస్ ఆధ్యాత్మికత అద్భుత కథ-చెప్పడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తోంది. సూపర్ పవర్స్‌ని పొంది, ప్రపంచాన్ని రక్షించే అండర్‌డాగ్ పాత్రకు తేజ సజ్జా యాప్ట్ చాయిస్. ఆకట్టుకునే లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో తేజ సజ్జ ఆ పాత్రలో ఒదిగిపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆ పాత్రను నేర్పుగా పోషించారు. వినయ్ రాయ్ తన విలనీ యాక్షన్ తో భయపెట్టారు. సముద్రఖని సాధువుగా తన ప్రజెన్స్ ని చాటారు. తేజకు అక్కగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించారు. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌లు కూడా స్పేస్‌ని దక్కించుకున్నారు.

హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. నిజాయితీగా కష్టపడి పని చేస్తే విజయం చేకూరుతుందని అంటారు. అందరినీ అలరించాలని ఈ సినిమా కోసం వందకి వందశాతం కంటే ఎక్కువ కష్టపడి పని చేశాను. నా ప్రయత్నం నేను చేశాను. విజయం వస్తుందనే ఆశిస్తున్నాను. మామూలు కుర్రాడికి దేవుని ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణ పనులు ఎమిటనేది ఈ సినిమా కథ. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే వుంది. ఒక మామూలు కుర్రాడిని. హనుమాన్ అనే సినిమా సూపర్ పవర్ లా నా చేతిలో వుంది. ఇంక అసాధారణ పనులు చేయడమే బాకీ. అవన్నీ జరిగిపోతాయని భావిస్తున్నాను. దేవుని ఆశీస్సులు ప్రేక్షకుల ప్రేమతో ఖచ్చితంగా మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇంత గొప్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతూ సినిమా తప్పితే మరో ఆలోచన లేకుండా పని చేస్తున్న ప్రశాంత్ వర్మ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట. నిర్మాత నిరంజన్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. ఈ పండక్కి హనుమాన్ వస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలన్న అసలు సిసలైన సంక్రాంతి సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా ఇది. పిల్లలకి హను మ్యాన్ పాత్ర చాలా నచ్చేస్తుంది. సంక్రాంతి అందరూ థియేటర్స్ కి రండి. హనుమాన్ మిమ్మల్ని చాలా గొప్పగా ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. అంత అద్భుతంగా వుంది. ఒక మార్వల్ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. హనుమాన్ మన మొదటి సూపర్ హీరో. ఆ ఎమోషన్ తో ఈ సినిమాని చేయడం నిజంగా అద్భుతం. తేజ చాలా చక్కగా నటించాడు. నిరంజన్ గారికి అభినందనలు. సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

2024 హను-మన్ నామ సంవత్సరం కానుంది. సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుదల కానుంది.

Also Read:జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్?

- Advertisement -