టీమిండియా మరియు సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో సఫారీలపై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అటు సఫారీ జట్టు సిరీస్ రేస్ లో నిలవాలంటే.. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దాంతో నేడు జరిగే ఈ రెండో వన్డే ఇరు జట్లకు కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రస్తుతం టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. గత మ్యాచ్ లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే టెస్ట్ సిరీస్ లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ వుంది. అయ్యర్ కు బదులుగా ఈ మ్యాచ్ లో టీ20 హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీరి తరువాత తిలక్ వర్మ, సంజు సంసన్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్ వంటి వారితో టీమిండియా లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే గత మ్యాచ్ లో ఐదు వికెట్లతో సత్తా చాటిన అర్షదీప్ సింగ్, అలాగే ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి వారితో పేస్ దళం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఇక సౌతాఫ్రికా టీంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. సాయంత్రం 4:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరి డూ ఆర్ డై గా ఉన్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
తుది జట్టు ( అంచనా )
టీమిండియా ; రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజు సంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కుల్దిప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.
Also Read:బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం