Revanth Reddy:రేవంత్.. గట్టెక్కేదెలా?

121
- Advertisement -

ఒకవైపు ఇచ్చిన హామీలు మరోవైపు ముంచుకొస్తున్న లోక్ సభ ఎన్నికలు ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు ఇలా అన్నీ సమస్యలు ఒకసారి సి‌ఎం రేవంత్ రెడ్డిని చుట్టుముట్టాయి. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకోవడమే ఇప్పుడు ముందున్న సవాల్. ప్రమాణస్వీకారం రోజునే ఆరు గ్యారెంటీ హామీలపై సంతకం చేయడం, కేవలం వంద రోజుల్లోనే హామీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి చెప్పడం అతిశయోక్తి గానే ఉన్నప్పటికీ.. ఆయన ఏం చేయబోతున్నారేనేది ఆసక్తి రేకెత్తించే అంశం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పది రోజులు దాటింది. ఆరు గ్యారెంటీలలో ప్రస్తుతం రెండు హామీలను అమలు చేస్తుండగా మరో 90 రోజుల్లో మిగిలిన హామీలను అమలు చేయాల్సి ఉంది. .

ఇదే టైమ్ లో లోక్ సభ ఎన్నికల హడావిడి కూడా మొదలు కానుంది. తెలంగాణలోని మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. లోక్ సభ ఎన్నికల భారం కూడా రేవంత్ పైనే ఉంచింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అటు హామీల అమలు.. ఎటు ఎన్నికల తంతు రేవంత్ రెడ్డిని గట్టిగానే ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల అమలుకు వేల కోట్లు ఆధానంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఆ హామీల అమలుకు కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సవాళ్లను ఎలా అదిగమించాలనే దానిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు కూడా. ఆయన సూచనల అనుసారం ఆర్థికంగా రాష్ట్రం మెరుగ్గానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆరు హామీలను అమలు చేస్తే ప్రజలపై ఆర్థిక భారం తప్పదని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రజలపై భారం పదకుండా హామీలు ఎలా అమలు చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. మొత్తానికి హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన వాటిని గట్టెకించడం సి‌ఎం రేవంత్ రెడ్డికి పెను సవాలే అంటున్నారు విశ్లేషకులు.

Also Read:యాక్ష‌న్ థ్రిల్ల‌ర్..‘భగీర’

- Advertisement -