21న కలెక్టర్ ల కాన్ఫరెన్స్!

36
- Advertisement -

ఈ నెల 21 అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాకా జరుగనున్న తొలి కాన్ఫరెన్స్ ఇది. కలెక్టర్ లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భూ రికార్డు లతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాల పై చర్చిచేఅవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు కూడా చర్చించే అవకాశం ఉంది.

ఆరు గ్యారంటీల అమలుతో పాటు మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లోపాలు, వైఫల్యాలను సైతం బయట పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి వెబ్ సైట్ కు సంబంధించి లక్షకు పైగా ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు పూర్తి నివేదిక అందిస్తే త్వరలోనే ధరణిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

Also Read:బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్

- Advertisement -