ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అధినేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలంటే టార్గెట్ తో పార్టీలో ప్రక్షాళనకు తెర తీశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పార్టీలో ఇంచార్జ్ ల మార్పు చేపట్టిన ఆయన సిట్టింగ్ లను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. దాదాపు 40 స్థానాల్లో సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్తవారిని బరిలో దించాలని చూస్తున్నారట. అటు చంద్రబాబు కూడా ఇదే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. .
వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతు ఉన్నవారికే సీట్ల కేటాయింపు అని ఇప్పటికే స్పష్టం చేసిన బాబు చాలా నియోజకవర్గాల్లో కొత్తవారిని బరిలో దించడం బెటర్ అనే అనే ఆలోచనలో ఉన్నారట. పైగా ఈసారి జనసేనతో కలిసి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీకి కూడా సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. అందువల్ల పక్కా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా అంతర్గత సర్వేలు చేయిస్తునట్లు సమాచారం. సర్వేల ఆధారంగా ప్రజా మద్దతు ఉన్నవారికే సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గత ఎన్నికల్లో సీటు దక్కని టీడీపీ సీనియర్ నేతలు కొంత అసంతృప్తిలో ఉన్నట్లు వినికిడి. ఇక ఈసారి సీట్ల కేటాయింపులో యువత కు అధిక ప్రాధాన్యం ఇస్తామని కూడా చంద్రబాబు గతంలో ప్రకటించారు. మరి గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీ అధినేత ఎలాంటి అసంతృప్తికి చోటివ్వకుండా సీట్ల కేటాయింపు ఎలా జరుపుతారో చూడాలి.
Also Read:‘దేవర’లో హైలైట్ ఎపిసోడ్ అదే

