స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలని…వికారాబాద్… మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతం అన్నారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికవడం గొప్ప విషయమన్నారు.
సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా అని తెలిపిన రేవంత్..ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ కి బాగా తెలుసు అన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలనని…వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ కృషి ఫలితమే అన్నారు. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపారన్నారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయం అని…సభలో అందరి హక్కులను వారు కాపడగలరన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు.
Also Read:మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి,శ్రీధర్ బాబు