డ‌బ్బు కోసం పుట్టిన ప్రేమ కాదు..

319
I Love Cating says Samantha
- Advertisement -

తెలుగు .. తమిళ భాషల్లో సమంతా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది ముసిముసినవ్వుల ముద్దుగుమ్మ సమంత. గ్లామర్ కు .. నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.వెండితెరపైనే కాదు .. సోషల్ మీడియాలోను సమంతా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

I Love Cating says Samantha

సినిమా హీరోయిన్ గానే కాదు.. సమంత మంచి మనసున్న మనిషి అని అభిమానులు సగర్వంగా చెప్పుకొంటారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే మరోవైపు ప్రత్యూష ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ చిన్న‌ది.

ఈ సంద‌ర్భంగా చిట్ చాట్‌లో మాట్లాడిన స‌మంత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం… అంటూ తన కొత్త చిత్రం కోసం నాగచైతన్య ఓ సంభాషణ చెప్పాడు. అభిమానులు ఆ మాటని సమంత దృష్టికి తీసుకెళ్లేసరికి ‘అది మిగతా అమ్మాయిల గురించి, నా గురించి కాదు’ అని నవ్వుతూ బదులిచ్చింది సమంత.

I Love Cating says Samantha

ఓ వైపు చైతూతో ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మ‌రోవైపు నట ప్రయాణంపై కూడా ప్రేమ అస్సలు తగ్గలేదంటోంది సమంత. ‘‘నటనంటే నాకు చెప్పలేనంత ప్రేమ. డబ్బు కోసమో, గుర్తింపు కోసమే పుట్టిన ప్రేమ కాదది. వాటికి అతీతమైన ప్రత్యేక బంధం నాకు సినిమాతో ఏర్పడింది. అందుకే ఈ ప్రయాణం ఎంతో సంతృప్తినిస్తోంద’’ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ఓ చిత్రంలోనూ, ‘రాజు గారి గది2’, ‘మహానటి’ చిత్రాల్లోనూ నటిస్తోంది.

- Advertisement -