కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ వడి వడి గా అడుగులు వేస్తోందా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలి సంతకాన్ని ఆరు గ్యారెంటీలపైనే చేశారు. దీంతో హామీల అమలు వేగంగా జరుగుతుందని ప్రజలు ఆశగా ఉన్నారు. తాజాగా ( డిసెంబర్ 9 న) మహాలక్ష్మి పథకం తో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని ప్రారంభించారు సిఎం రేవంత్ రెడ్డి. ఇక మిగిలిన హామీలను 100 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా వాటి అమలు దిశగా వేగంగా అడుగులు వేయడం హర్షించాల్సిన విషయమే అయినప్పటికీ ఇదే స్పీడ్ ముందు రోజుల్లో కూడా కొనసాగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఎందుకంటే ఏపీలో 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా ఇదే రీతిలో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అన్నీ హామీలు నెరవేర్చుతాని చెప్పారు తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చాలా హామీలను జగన్ గాలికి వదిలేశారనే విమర్శ ఉంది. ఆ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి వైఖరి కూడా అలాగే ఉండబోతుందా అనే సందేహాలను కొందరు రాజకీయవాదులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక పోతే ఎన్నికల ముందు ప్రకటించిన మరికొన్ని హామీల విషయంలో సిఎం రేవంత్ ఎడ్డి ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే మెగా డీఎస్సీ విడుదల చేయడంపై కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల ప్రచారంలో తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి తొలి కేబినెట్ సమావేశం పూర్తయిన ఇంకా మెగా డీఎస్సీ పై క్లారిటీ రాలేదు. మరి ఈ హామీల అమలుపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
Also Read:IND vs SA T20:బోణి కొట్టేదెవరు?