IND vs SA T20:బోణి కొట్టేదెవరు?

46
- Advertisement -

సౌతాఫ్రికా టూర్ లో భాగంగా నేడు ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికాలోని హాలీవుడ్ కింగ్స్ మేడ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్న ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచి భోణి కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. వరల్డ్ కప్ లో ఓటమి చవి చూసినప్పటికి ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు సౌతాఫ్రికా పై కూడా విజయం సాధించి మరింత ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కు దూరమైన శుబ్ మన్ గిల్, జడేజా, సిరాజ్.. ఈ సిరీస్ తో తిరిగి జట్టులోకి రానున్నారు. ఇక ఆల్రెడీ ఫుల్ ఫామ్ లో ఉన్న జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్. ఈ సిరీస్ లో కూడా అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు. అటు సౌతాఫ్రికాలో కూడా హార్డ్ హిట్టర్స్ కు కొదువేమీ లేదు. హేండ్రీక్స్, క్లాసేన్, స్టబ్స్, మిల్లర్ వంటి బ్యాట్స్ మెన్స్ తో పాటు బౌలింగ్ లో కేశవ మహారాజ్, శంషి, ఎంగిడి వంటి టాప్ క్లాస్ బౌలర్స్ ఆ జట్టు సొంతం. ఇక ఇప్పటివరకు ఇరు జట్ల మద్య 24 మ్యాచ్ లు జరగగా అందులో 13 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. 10 మ్యాచ్ లలో మాత్రమే సఫారీ జట్టు పైచేయి సాధించింది. మరో మ్యాచ్ లో మాత్రం ఫలితం తేలలేదు. మరి ఈ సిరీస్ లో ఏ జట్టు పైచెయ్ సాధిస్తుందో చూడాలి. ఈ టీ20 సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది.

Also Read:Pawan:పవన్‌కు దిక్కు తోచడంలేదా?

- Advertisement -