ఫెర్టీ 9..బేబీ మీట్

62
- Advertisement -

మాతృత్వపు మధురిమలు మరువలేనివని ప్రముఖ సినీనటి స్నేహ అన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్సలు అందిస్తున్న ఫెర్టి 9 సంస్థ ఐటిసి గ్రాండ్ కాకతీయలో బేబీ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్నేహ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ జ్యోతితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం స్నేహ మాట్లాడుతూ మహిళలకు దేవుడిచ్చిన వరం మాతృత్వమని సంతానలేని సమస్యతో బాధపడే జంటలకు ఆధునిక చికిత్సలు అందించి మాతృతపు అనుభూతులను పంచుతున్న ఫెర్టీ 9 సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మీట్ లో పాల్గొన్న జంటలు చిన్నారులతో కలిసి ఆనందంగా గడిపారు. చిన్నారుల తల్లి తండ్రులతో కలిసి ఫోటోలు దిగారు.

- Advertisement -