- Advertisement -
పేదల పక్షానే మా పోరాటం ఉంటుందన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన కూనంనేని..రాష్ట్రం లో ఉన్న పరిణామాల దృష్ట్యా మేము పొత్తులకు వెళ్ళాల్సి వచ్చిందన్నారు.కమ్యునిస్ట్ పార్టీ నుండి నేను ఒక్కడినే ఎమ్మెల్యే గా ఉన్నానని తెలిపారు.
పేదల పక్షాన పోరాటం చేస్తాను..అవినీతి కి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. ఉపా చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మద్దతు తో గెలిచాను… సహకరిస్తే సమన్వయంతో కలిసి పని చేస్తాను..లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తానని వెల్లడించారు. ఎప్పటికీ సామాన్య ప్రజల పక్షాన ఎప్పుడు నిలపడుతామన్నారు.
Also Read:అమరవీరులని అవమానించిన కాంగ్రెస్:అనిల్
- Advertisement -