- Advertisement -
తనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదని…సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానన్నారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు.నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతానని తెలిపారు.
మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 11మంది మంత్రులకు శాఖల కేటాయింపు.. మిగిలిన 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేదాని పై అదిష్టానం తో చర్చించనున్నారు సీఎం. తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Also Read:ఎండు కొబ్బరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో!
- Advertisement -