- Advertisement -
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తీసుకుంటారు. తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సోమవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నీటిమట్టాలు తిరుమలకు దాదాపు 250 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.
Also Read:సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా
1) పాపవినాశనం డ్యామ్ :- 693.60 మీ.
FRL :- 697.14 మీ.
2)గోగర్భం డ్యామ్ :- 2887′ 00″
FRL :- 2894′ 0″
3) ఆకాశగంగ డ్యామ్ :- 859.80మీ
FRL :- 865.00మీ
4)కుమారధార డ్యామ్ :- 896.20మీ
FRL :- 898.24మీ
5)పసుపుధార డ్యామ్ :- 895.90మీ
FRL :- 898.28మీ
- Advertisement -