2000 కోట్ల వేటలో ‘బాహుబలి 2’

220
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి ఏకంగా ఒక్క‌రోజులోనే 200 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లపై బాహుబలి-2 ప్రదర్శితమైంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మల్టీప్లెక్స్‌ల్లో రోజుకు 15 నుంచి 20 షోలు నడిచాయి. ప్రదర్శితమవుతున్నాయి. గత పదేళ్లలో ఏ సినిమాకీ లేని విధంగా 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి బాహుబలి సత్తాచాటింది.

Baahubali 2” Movie Reach the 2000 Crore

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి 2’ ఇంకా అదే ఊపును కొనసాగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక చిత్రాల రికార్డులను సైతం తిరగరాస్తూ దూసుకుపోతోంది. 10 రోజుల్లోపే 1000 కోట్ల గ్రాస్ ను సాధించి, అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.20 రోజుల్లోపే ఈ సినిమా 1500 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో కొత్త సినిమాలు విడుదలవుతున్నా, ‘బాహుబలి 2’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం.

Baahubali 2” Movie Reach the 2000 Crore

అయితే 2000 కోట్ల క్లబ్ కు చేరువ అవుతుందా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో సందడి చేస్తోన్న ‘బాహుబలి 2’ మొత్తమ్మీద 1500 కోట్లకు దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే చైనా మార్కెట్ నుండి ‘దంగల్’ను అధిగమించేలా 300 కోట్ల క్లబ్ లో చేరితే గనుక, మొత్తం 1800 కోట్లకు చేరుకుంటుంది. ఒక్క చైనానే కాకుండా, జర్మన్ తదితర దేశాలలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్న నేపధ్యంలో… ఆ దేశాల నుండి మరో 200 కోట్లు రాబట్టగలిగితే… ఓవరాల్ గా “బాహుబలి 2” 2000 కోట్ల క్లబ్ ను లిఖించే అవకాశం లేకపోలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

- Advertisement -