హూ ఈజ్ ‘కింగ్ మేకర్ ‘ !

70
- Advertisement -

తెలంగాణ ఎన్నికల విషయంలో ఈసారి జరిగిన హోరాహోరీ పోరు బహుశా గతంలో జరగలేదనే చెప్పాలి. 2018, 2014 ఎన్నికల్లో ఏకపక్షంగా సాగిన ఎలక్షన్ వార్ 2023 ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరుగా మారింది. బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా ఈసారి అధికారం కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఫలితంగా ఎవరిది అధికారం అనే విషయాన్ని సర్వే సంస్థలు కూడా అంచనా వేయలేకపోయాయనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కు పట్టం కడితే మరికొన్ని సర్వేలు బి‌ఆర్‌ఎస్ దే అధికారం అని తేల్చి చెప్పాయి. ఇంకొన్ని సర్వే సంస్థలు హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాయి. దీంతో ఒకవేళ హంగ్ వస్తే ఏ పార్టీ కీలకంగా మారనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరువాత ఏంఐఏం పార్టీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈసారి ఎంఐఎం 7-10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక బీజేపీ కూడా కూడా 5-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దాంతో ఈ రెండు పార్టీలు కింగ్ మేకర్ అవుతాయా అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏంఐఏం పార్టీ బి‌ఆర్‌ఎస్ కు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ మద్దతు ఎవరికి అనేది ఊహించలేని పరిస్థితి. మొత్తానికి తెలంగాణ ఫలితాలపై ముందస్తు అంచనాలు ఎవరికి ఊహలకు అందకపోవడంతో తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

Also Read:‘సలార్’పై ఆసక్తికర విషయాలు.. నిజంగా గ్రేట్

- Advertisement -