బోల్డ్ రోల్స్ కి కేరాఫ్ ఈ బ్యూటీ

30
- Advertisement -

‘శోభిత ధూళిపాళ’ అచ్చ తెలుగు బ్యూటీ. అయితేనేం.. చాలా డిఫరెంట్ గా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా అడల్ట్ సీన్స్ ను ఏమాత్రం మొహమాటం లేకుండా చేయడంతో.. బాలీవుడ్ ఆమెను గుర్తించింది. సాటి హీరోయిన్లతో పోలిస్తే శోభిత ధూళిపాళది పెక్యులర్‌ కెరీర్‌ కూడా. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు, టీవీ షోలు.. ఇలా ఏదైనా సరే నచ్చితేనే చేస్తుంది. నచ్చకపోతే.. ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే వదిలేస్తుంది. అదే, శోభిత ప్రత్యేకత. రీసెంట్‌గా శోభిత ధూళిపాళ ఓ వెబ్ సినిమా కోసం ఓ బోల్డ్ రోల్ చేసింది. తాజాగా తన బోల్డ్ పాత్ర గురించి వివరించింది శోభిత.

బోల్డ్ గా నటించాలి అంటే.. ధైర్యం కావాలి. అలాగే మంచి ఫిజిక్ ఉండాలి. నేను బోల్డ్ సీన్స్ లో నటించే సమయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకొను. కిస్ చేసినా కసిగానే చేస్తాను. నా కో స్టార్స్ తో కూడా ఇదే విషయాన్ని చెబుతాను. రెచ్చిపొండి అని. కాకపోతే, కొందరు మాత్రం సిగ్గు పడుతూ ఉంటారు. నటించడానికి సిగ్గు దేనికో నాకు అర్ధం కాదు. నేను మాత్రం నా పాత్ర కోసం ఏదైనా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ. అన్నట్టు శోభిత ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ‘మత్తు’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ సిరీస్ లో శోభిత ధూళిపాళతో పాటు భూమి పడ్నేకర్ కూడా నటిస్తోంది. ఇది కూడా పక్కా బోల్డ్ సిరీస్ అట. ఈ సిరీస్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలి అనుకుంటున్నారట మేకర్స్. మొత్తానికి శోభిత ధూళిపాళ బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అయ్యింది అన్నమాట.

Also Read:‘సలార్’పై ఆసక్తికర విషయాలు.. నిజంగా గ్రేట్

- Advertisement -