ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

41
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలుస్తారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా స్ట్రాంగ్‌ రూం నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది కౌంటింగ్‌ రూంకు తీసుకెళ్తారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఫలితాలు వెల్లడయ్యాక ఆయా పార్టీలు విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, పటాకులు కాల్చవద్దంటూ నిషేధాజ్ఞలు విధించింది.

కౌంటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 14 టేబుళ్లలో కౌంటింగ్‌ సిబ్బంది ఓట్లను లెక్కిస్తుండగా అక్కడే ఉన్న కంట్రోల్‌ రూంలో ఎప్పటికప్పుడు సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. కౌంటింగ్‌ హాల్‌కు ఒక పక్క మీడియా సెంటర్‌ను, మరో పక్క ఆయా పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక హాళ్లను కేటాయించారు.

కౌంటింగ్‌ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేడు అంతటా 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని …కౌంటింగ్‌ పూర్తయిన 24గంటల తర్వాత అనుమతి తీసుకుని సంబురాలు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

Also Read:BJP:తెలంగాణలో కమలం వికసిస్తుందా?

- Advertisement -