ఆ ఇద్దరిలో అదే భయం!

47
- Advertisement -

తెలంగాణలో ఎవరి భవిష్యత్ ఏంటో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రేపు విడుదల అయ్యే ఫలితాలతో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో బహిర్గతం కానుంది. అయితే పార్టీల గెలుపోటముల సంగతి అటుంచితే రేపు విడుదల అయ్యే ఫలితాలు ఓ ఇద్దరిని మాత్రం కలవరానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు ఎవరనగా బీజేపీలోని కీలక నేత ఈటెల రాజేందర్ మరియు టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరిని ఓటమి భయం వెంటాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా రెండేసి చోట్ల పోటీ లో దిగిన సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ అలాగే రేవంత్ రెడ్డి కోడంగల్ తో పాటు కామారెడ్డిలోను పోటీ చేశారు. అయితే కేవలం బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ తో ఢీ కొనేందుకే ఆ ఇద్దరు రెండు చోట్ల పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే..

బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేల ప్రకారం రెండు చోట్ల కూడా కే‌సి‌ఆర్ భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దాంతో గజ్వేల్ లో ఈటల రాజేందర్ మరియు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం అనేది చాలమంది అభిప్రాయం. అలాగే అటు హుజూరాబాద్ లో కూడా ఈటెల రాజేందర్ కు ఈసారి ప్రతికూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అలాగే కొడంగల్ లో ఈసారి రేవంత్ రెడ్డి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మొత్తానికి ఈటల రాజేందర్ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గెలుపు విషయంలో కొంత సంధిగ్డం లోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:‘పిండం’..ప్రేక్షకులను అలరిస్తుంది

- Advertisement -