BJP:తెలంగాణలో కమలం వికసిస్తుందా?

35
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో బహిర్గతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్య విన్నింగ్ కాంపిటేషన్ గట్టిగా కనిపిస్తోంది. ఇకపోతే ఆ మధ్య తెలంగాణలో అధికారం మాదే అని హడావిడి చేసిన బీజేపీ ఎన్నికల సమయంలో మాత్రం బోల్తా పడింది. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది ? ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది ? అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కేవలం గోషామహల్ లో మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి మరో రెండు సీట్లను సొంతం చేసుకుంది. .

ఇక ఈసారి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం బీజేపీ కి 5-10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ పై ప్రజల్లో విశ్వసనీయత లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాగా ఈ ఎన్నికలను కమలనాథులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించి పార్టీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి వారికి కూడా గెలుపు కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం ఎంతమేర ఉంటుందో చూడాలి..

Also Read:షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్?

- Advertisement -