నిమ్మ కాయలను ఆహారంగా తీసుకుంటే లభించే ప్రయోజనాల సంగతి తెలిసిందే. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. నిమ్మలో విటమిన్-సితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా నిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.
ఎండాకాలంలో వేడితో బాధపడేవారు నిమ్మరసాన్ని నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుందనే సంగతి తెలిసిందే. నిమ్మను ఆహారంగా తీసుకోవడమే కాదు.. ఇతరత్రా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నిమ్మకాయను ముక్కలుగా కోసి పడక గదిలో ఉంచుకొని నిద్రించడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. నిమ్మ ముక్కలు గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. గది కూడా పరిమళ భరింతగా మారుతుంది. కొన్ని నిమ్మకాయలను ముక్కలుగా తరిగి బెడ్రూంలో ఉంచుకొని నిద్రించడం వల్ల శ్వాస చక్కగా తీసుకోగల్గుతారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఒత్తిడి దూరం కావడానికి కూడా ఈ చిట్కా తోడ్పడుతుంది. ఆస్తమా, అలర్జీలు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ ముక్కలను పడక గదిలో ఉంచుకొని నిద్రించడం ఫలితాన్నిస్తుంది. నీరసం కూడా మాయమవుతుంది. దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మ కాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పడుకునే గదిలో ఉంచుకుంటే సరి. దోమలు పారిపోతాయి.