ప్చ్.. ‘రష్మిక’ పని అయిపోయినట్టే

63
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా ఈ సారి ‘యానిమల్’ అంటూ వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమా నేడు విడుదలైంది. సినిమా ఏ మాత్రం బాగలేదు కొందరు, పర్వాలేదు బాగుందని పలువురు ట్విట్టర్‌లో పోస్ట్ లు పెడుతున్నారు. సరే.. సినిమా అవుట్ ఫుట్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర పై ఇప్పుడు నెగిటివ్ టాక్ బాగా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కి ముందు, కేవలం గ్లామర్ పరంగానే కాకుండా కొంత యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్రలో తాను నటించాను అంటూ రష్మిక మందన్నా బిల్డప్ కి పోయింది.

కానీ, తీరా సినిమా చూస్తే.. అసలు రష్మిక మందన్నా ఏడుస్తోందా ?, నవ్వుతుందా ? అని కూడా అర్ధం కావడం లేదు ఓ సన్నివేశంలో. రణబీర్ పాత్ర మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. తాను ఏదో గొప్ప కార్యం చేసిన ఘనుడిలా ఇంటికొచ్చి తన భార్యామణితో చెబుతాడు. మరి ఆ భార్య పాత్రలో కనిపించిన రష్మిక మందన్నా ఆ సీన్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. కానీ, ప్రేక్షకులకు మాత్రం పిచ్చి పట్టింది. రష్మిక ఫేస్ లోని ఎక్స్ ప్రెషన్స్ అర్ధం కాక తల బొప్పి కట్టింది. యాక్టింగ్ రానప్పుడు సైలెంట్ మోడ్ లో ఉంటే.. కనీసం ఎదుటి వారి ఎక్స్ ప్రెషన్స్ వేసి కవర్ చెయ్యొచ్చు.

కానీ, మేడమ్ గారు అతి కదా. ఆ అతి దెబ్బకు మతులు పోయిన్నాయి. ఇకనైనా రష్మిక మందన్నా ఇలాంటి యాక్టింగ్ ఉన్న పాత్రల జోలికి పోకుండా ఉంటే మంచిది. ఏది ఏమైనా యానిమల్ దెబ్బకు రష్మిక పని అయిపోయినట్టే. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి కూడా చెప్పుకోవాలి. అసలు ఈ సినిమాలో అంత హింస ఎందుకు పెట్టాడో …పైగా మనిషిని చూపించటం మానేసి , యానిమల్ లా ఎందుకు మార్చాడో అతగాడికే తెలియాలి. బాబుకు సహజంగానే పైత్యం ఎక్కువ. ఆ పైత్యానికి తగ్గట్టు ఈ సినిమా కూడా అలాగే తయారు అయ్యింది.

Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు..

- Advertisement -