Harish:కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు

56
- Advertisement -

కేసీఆర్ దీక్ష లేక పోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు మంత్రి హరీశ్‌ రావు. కేసీఆర్ చారిత్రాత్మక దీక్ష నవంబర్ 29 దిక్షా దివస్ సందర్బంగా సిద్దిపేట రంగాదంపల్లి అమర వీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించారు. అనంతరం మాట్లాడిన హరీశ్..చరిత్ర మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తీసుకున్న రోజు.. దీక్షకు సిద్దిపేట కేంద్రం అన్నారు.

ఐతే తెలంగాణ జైత్ర యాత్ర.. లేదంటే తన శవయాత్ర గా దీక్ష చేపట్టారన్నారు. ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ ఆకాంక్షలు నిజం చేసిన రోజు అని.. సిద్దిపేటలో అమరన దిక్ష కోసం వస్తుంటే కరీంనగర్ అలుగునూరు లో కేసీఆర్ ను ఆరెస్ట్ చేసి ఖమ్మం జైలు కు తరలించారన్నారు. ఖమ్మం జైల్లో కేసీఆర్ తన దీక్ష కొనసాగించారని… కేసీఆర్ పై నాటి సమైకు పాలకులు అనేక కుట్రలకు పాల్పడ్డారన్నారు.

కేసీఆర్ ఆరోగ్యం క్షినిస్తుంటే, కేసీఆర్ ను హైదరాబాద్ కు తరలించే క్రమంలో వెలాదిగా ప్రజలు తరలి వచ్చారని… దీక్ష 9, 10 రోజు న కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, అసలు ఎం జరుగుతుందో అనే ఆందోళన ఉందని.. కేసీఆర్ దీక్షతో అప్పటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించారన్నారు. తెలంగాణ టాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు నిజమైందంటే నాటి కేసీఆర్ పోరాటమే కారణం అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం క్షినిస్తుంటే ప్రజలు అంతా ఏకమయ్యారు.. ఎక్కడెక్కడ ఆందోళనలు మొదలై… నాడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మెదక్ పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు.

అలుగునూర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం వైపు తీసుకెళ్తూ ఉంటే కేసీఆర్ ను ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారో అన్న భయం వేసిందని… కాంగ్రెస్ ఇచ్చిన మాట వెనక్కి తీసుకుని పొక పోయి ఉంటే ఈ బలిదానాలు జరిగి ఉండేవి కావు.. విద్యార్థులు బలయ్యే వారు కాదన్నారు. కేసీఆర్ అరెస్టుతో తెలంగాణ ఉద్యమం విస్పోటనం గా మారిందని… నేటి తెలంగాణ సాకారానికి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి కేసీఆర్ దీక్ష నే కారణం అన్నారు.

Also Read:స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!

- Advertisement -