ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

44
- Advertisement -

కాంగ్రెస్ తరుపున సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్న మల్లు భట్టి విక్రమార్క కు ఓటమి భయం పట్టుకుందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన. నాలుగు సార్లు మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు మధిరలో ఓటమి తప్పెలా లేదు. నియోజక వర్గంలో భట్టి విక్రమార్క ప్రజలు అందుబాటులో ఉండరనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికి ప్రజల పక్షాన నిలబడటంలో భట్టి వెనుకబడ్డారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తేస్తున్నారు. ఇక నియోజక పార్టీ కార్యకర్తలతో కూడా భట్టి అందుబాటులో ఉందరనే అసంతృప్తి పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది..

పీపుల్స్ మార్చ్ అంటూ పాదయాత్ర నిర్వహించినప్పటికి ఆ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదనే టాక్ కూడా మధిర నియోజకవర్గంలో వినిపిస్తోందట. పైగా కాంగ్రెస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా ఈసారి భట్టికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 3 వేల 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో లింగాల కమల్ రాజ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన లింగాల కమల్ రాజ్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా మద్దతు కూడా గట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. పైగా బి‌ఆర్‌ఎస్ పై ప్రజల్లో ఉన్న సానుకూలత కూడా మధిరలో లింగాల కమల్ రాజ్ కు హెల్ప్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నా మాట. దీంతో తాజా పరిణామాలు చూస్తే మధిరలో భట్టి విక్రమార్క కు వ్యతిరేక గాలి విస్తోందనే స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. ఉపేంద్ర గాడి అడ్డా

- Advertisement -