గాలి లేదు గత్తరు లేదు..గెలిచేది బీఆర్ఎస్సే

38
- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఇక ఎన్నికల ప్రచారంలో మొదటి నుండి దూకుడు మీదున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. అభ్యర్థుల ప్రకటన దగ్గరి నుండి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు, కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఇక ప్రధానంగా సీఎం కేసీఆర్ దాదాపు 90 సభలకు పైగా హాజరయ్యారు. వయసును సైతం లెక్క చేయకుండా 90 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించడం పార్టీ శ్రేణులనే కాదు ప్రజల్లోనూ ఉత్సాహం నింపింది. ఇక సీఎం కేసీఆర్ తొలి బహిరంగ సభ నుండి ఇవాళ గజ్వేల్‌లో జరిగే చివరి బహిరంగసభను పరిశీలిస్తే ఒకటే అర్థమవుతుంది.జనం స్వచ్చందంగా గులాబీ జెండాను పట్టి కదిలారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉన్నామని…హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమా కల్పించారు ప్రజలు.

మరోవైపు కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రచారం జరుగుతున్న అది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే. క్షేత్రస్ధాయిలో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రతీ సభలోనూ చెబుతూ వస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని..తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడిస్తూ ప్రజలను ఆలోచింపజేశారు సీఎం.

ఇక సీఎం కేసీఆర్ ప్రసంగం అంటేనే కామెడీ, సెటైర్లు, ప్రత్యర్థులపై తనదైన శైలీలో మాటల దాడి. కానీ సారి మాత్రం ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్ ప్రసంగాలు సాగాయి. తెలంగాణ రాకముందు..తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించడంలో కేసీఆర్ 100 శాతం సక్సెస్ అయ్యారు. ప్రతీ ఊరిలోనూ కేసీఆర్ ప్రసంగాలపైనే చర్చ. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన మాటలన్ని అక్షర సత్యాలు. కాంగ్రెస్,బీజేపీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదని ప్రజలకు తెలిసిపోయింది. ప్రధానంగా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయ్యాలని..అలాగే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం కంటే ఇందిరమ్మ రాజ్యంతో ప్రజలకు వచ్చే నష్టాలు,కష్టాలను వివరించడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు. సాధారణ ప్రజలను ఎవరిని అడిగినా ఇందిరమ్మ రాజ్యం అంటే అరాచకం,ఆకలి,వలసలు అని చెప్పే పరిస్థితి వచ్చింది.

మొత్తంగా దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులతో పాటు అంతా అభిప్రాయపడుతున్నారు.

Also Read:మహేష్ సినిమాలో.. మోర్ వైలెన్స్?

- Advertisement -