ఇజ్రాయెల్‌-హమాస్‌…కాల్పుల విరమణ పొడగింపు

45
- Advertisement -

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య రెండు నెలలుగా జరుగుతున్న భీకర యుద్ధానికి తాత్కాలిక విరామం లభించిన సంగతి తెలిసిందే. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాయి ఇరు పక్షాలు. ఇక ఇవాళ్టితో నాలుగు రోజులు పూర్తవుతుండగా తాత్కాలిక కాల్పుల విరమణ పొడగింపునకు హమాస్-ఇజ్రాయెల్‌ అంగీకరించాయి. రెండ్రోజులు కాల్పుల విరమణ ఒప్పందం పొడగించడంతో మరికొంతమంది బందీలు విడుదల కాబోతున్నారు.

హమాస్.. ఇవాళ 10మందిని, రేపు 10మందిని విడుదల చేయనుంది. అటు ఇజ్రాయిల్‌ మాత్రం రోజుకు 30మంది చొప్పున పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. తొలివిడతలో హమాస్ 24 మందిని విడుదల చేయగా పాలస్తీన 39 మంది ఖైదీలను రిలీజ్ చేసింది.

గత నెల 7న ఇజ్రాయెల్‌ సరిహద్దు గ్రామాలపై దాడిచేసిన హమాస్‌ 240 మందిని బందీలుగా తమతో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా హమాస్‌ 50 మంది బందీలను, ఇజ్రాయెల్‌ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది.

Also Read:Modi:బీజేపీని మోడీ బతికిస్తారా?

- Advertisement -