Keshavarao:రైతు బంధు ఆపడం సరికాదు

32
- Advertisement -

రైతులకు మేలు చేసే రైతు బంధును ఆపడం సరికాదన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు. ఎన్నికల కమిషనర్‌ వికాస్ రాజ్‌ని కలిసి అనంతరం మాట్లాడిన కేకే.. రైతుబంధు అంశం ఏ పార్టీకి సంబంధించిన అంశం కాదు అన్నారు. ఇది రైతులకు సంబంధించిన అంశం…రోగికి ఆపరేషన్ చేసే టైంలో అవసరమైన ఇంజక్షన్ ఇప్పుడు వద్దు… 15 రోజుల తర్వాత తీసుకురావాలని చెప్పినట్లుందన్నారు.ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ గతంలో ఎప్పుడూ వెనక్కు తీసుకోలేదు, సీఈఓ కూడా ఆశ్చర్యపోయారన్నారు.

కనీసం నోటీసు ఇవ్వకుండా నాలుగు కోట్ల మందికి సంబంధించిన విషయంపై ఎలా ఉత్తర్వులు ఇస్తారు? అని ప్రశ్నించారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని…మాకు నోటీసు ఇచ్చి ఉంటే సమాధానం చెప్పేవాళ్ళం అన్నారు. ఈసీ ఆక్రమంగా అదేశాలు ఇచ్చిందని…లక్షల మంది రైతులకు, దేశానికి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంక్షలు పెట్టాలని చెప్పిందని…ఈసీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.

బీఆర్ఎస్ ను దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్యాయం చేయవద్దని…మన రాజకీయాలు, కోపతాపాల కోసం రైతులకు నష్టం చేయవద్దని పార్టీలను కోరుతున్నాం అన్నారు. నా విజ్ఞప్తిని ఈసీ దృష్టికి తీసుకెళ్తానని సీఈఓ చెప్పారు…రైతుబంధు చెల్లింపుల కోసం ఈసీ నుంచి రేపటి వరకు ప్రయత్నం చేస్తాం అన్నారు. అనుమతి రాకపోతే ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం అని…భాజాపాకు, కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదన్నారు.

Also Read:CM KCR:అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం..

- Advertisement -