బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో రణ్‌బీర్ నటించిన యానిమల్ ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ రీసెంట్‌గానే లాక్ అయ్యింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్నట్టు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. యానిమల్‌లో విలన్ పాత్రకు డైలాగ్స్ ఉండవని తెలుస్తోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రణ్‌బీర్ కపూర్, రష్మిక రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్’కు హాజరయ్యారు. అందులో మేనక పౌదుల్ అనే దివ్యాంగురాలైన కంటెస్టెంట్ ‘అగర్ తుమ్ సాత్ హో’ అనే రణ్‌బీర్ పాటను ఆలపించింది. ఆమె పాడిన తీరుకు మంత్రముగ్ధుడైన రణ్‌బీర్ పాట పూర్తికాగానే రష్మికతో కలిసి స్టేజ్ మీదకు వెళ్లి ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.
ఆమెకు చూపు లేకపోవడంతో రణ్‌బీర్ తనను పరిచయం చేసుకున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో కంటెస్టెంట్ పాదాలను రణ్‌బీర్ తాకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా మధ్య ఫుల్ బోల్డ్ సీన్స్ ఉన్నాయని టాక్. సహజంగానే తన హీరోహీరోయిన్ల చేత సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో రొమాన్స్ చేయిస్తాడు. పైగా ఈ సినిమాకి యానిమల్ అని టైటిల్ పెట్టాడు. ఇక ఏ రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో చూడాలి.
Also Read:మన్సూర్ క్షమాపణపై త్రిష స్పందన ఇదే