Nani:సినిమానే నా ఊపిరి

48
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ లాంచ్ చేశారు.

నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని కోరుతుంది. అతను ప్రతిదీ వివరిస్తాడు కానీ ఆమె తల్లి గురించి ఏదో దాచిపెడతాడు. కథలో చాలా ఎమోషన్ ఉంది, దీంతో పాప తన తల్లి గురించి తండ్రిని ఇబ్బందిపెట్టాలని అనుకోదు. కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పాప కొత్త స్నేహితురాలు యష్నా (మృణాల్)ని తన తల్లిగా ఊహించుకుంటుంది. అయితే, శృతి హాసన్, విరాజ్ భార్యగా, మహి తల్లిగా రివిల్ అవుతుంది.

ట్రైల‌ర్ ముందుకు వెళుతున్న కొద్దీ క‌థ‌లో చాలా లేయ‌ర్లు ఆసక్తిగా తెరపైకి వస్తాయి. ప్రేమకథలో మ్యాజిక్ ఉంది, తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రతిఒక్కరినీ హత్తుకుంటుంది. దర్శకుడు శౌర్యువ్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ని అద్భుతంగా మలిచాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భిన్నంగా కథను చాలా కొత్త తరహాలో ప్రజెంట్ చేశాడు.

దసరాలో మాస్ క్యారెక్టర్ తర్వాత నాని పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించడం కొత్తగా వుంది. తండ్రిగా, ప్రేమికుడుగా వైవిధ్యమైన పాత్రలో అద్భుతంగా నటించారు నాని. తన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. మృణాల్ ఠాకూర్ మనసుని ఆకట్టుకునే నటన కనబరిచింది. శృతి హాసన్ శ్రుతి హాసన్ ప్యాకేజీ. బేబీ కియారా ఖన్నా చాలా క్యూట్ గా మనసుల్ని దోచేసింది.

రొమాంటిక్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎపిసోడ్స్ , ప్రతి ఫ్రేం లో టాప్-నాచ్ కెమెరా యాంగిల్స్‌, లైటింగ్‌ తో సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్‌ ప్రేక్షకులని కట్టిపడేశారు. గోవా, కూనూర్ మొదలైన అద్భుతమైన లొకేషన్‌లు చాలా బ్యూటీఫుల్ గా చిత్రీకరించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్లాస్‌తో పాటు ఎమోషనల్ కనెక్షన్‌ని అద్భుతంగా జోడిస్తుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ మరో ఆకర్షణ. మొత్తం మీద, హాయ్ నాన్న ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్సులు, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్‌తో అద్భుతమైన టెక్నికల్ వర్క్ తో ఎమోషనల్ రైడ్‌ను అందిస్తుంది. ‘హాయ్ నాన్న’ తప్పకుండా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.

Also Read:ఒరిజినల్ డాక్యుమెంట్ ..‘కూసే మునస్వామి వీరప్పన్’

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చుసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ‘హాయ్ నాన్న’ సినిమాకే(నవ్వుతూ). శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజివల్స్ చాలా బావుంటాను. టీజర్ పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్ తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా… డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ భాద్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ప్రామిస్. అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్ అన్నారు.

- Advertisement -