బి‌ఆర్‌ఎస్ దే విజయం.. తేల్చేసిన సర్వేలు!

57
- Advertisement -

తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల గెలుపోటములపై సర్వేలు, విశ్లేషణలు తెరపైకి వస్తుండడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీదే విజయం అని తేల్చి చెబుతున్నాయి. ఆ మధ్య బహిర్గతం అయిన టైమ్స్ నౌ, జీ న్యూస్, ఇండియా టుడే.. ఇలా ప్రధాన సర్వే సంస్థలన్నీ కూడా పూర్తి ఆధిక్యాన్ని బి‌ఆర్‌ఎస్ కే కట్టబెట్టాయి. ఇక మరో సర్వే బి‌ఆర్‌ఎస్ దే విజయం అని తేల్చి చెప్పడంతో కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని స్పష్టంగా తెలుస్తోంది.

మొత్తం 119 నియోజకవర్గాల్లో 38,351 మంది అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వేలో 42 శాతం ఓట్లతో బి‌ఆర్‌ఎస్ కు 75 స్థానాలు, 32 శాతం ఓట్లతో కాంగ్రెస్ కు 31 స్థానాలు, 16 శాతం ఓట్లతో బీజేపీకి 5 స్థానాలు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. దీంతో గెలుపు మాదే అంటూ పగటి కలలు కంటున్న కాంగ్రెస్ కు ఈ సర్వే గట్టి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు ఈ మధ్య గెలుపు విషయంలో తెగ హడావిడి చేస్తున్నప్పటికి గ్రాండ్ లెవెల్ లో హస్తం పార్టీని ప్రజలు అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయం ఆ పార్టీ అంతర్గత సర్వేలో కూడా వెల్లడైనట్లు టాక్. అందుకే ఆ లోపాన్ని కవర్ చేసుకునేలా కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లు చేస్తోందనేది కొందరి అభిప్రాయం. ఇక రియాలిటీలో బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదని మరోసారి ఈ సర్వే నిరూపించడంతో తెలంగాణ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయం తథ్యం అని తెలుస్తోంది.

Also Read:డబుల్ ఇస్మార్ట్‌లో మణిశర్మ ఆన్ బోర్డ్

- Advertisement -