చరిత్ర సృష్టించిన భారత్..!

40
- Advertisement -

వరల్డ్ కప్ తర్వాత టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ కప్ ఓడిపోయిన బాధ నుంచి అభిమానులకు కొంత ఉపశమనం లభించిందనే చెప్పాలి. నిన్న వైజాగ్ లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లలో ఇంగ్లీస్ ( 110 ) సెంచరీతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ ( 52 ), పరుగులతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. .

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ గా వెనుదిరిగాడు. యశస్వి (21) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికి, ఆ తరువాత వచ్చిన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధించింది. ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80), విజయానికి బాటలు వేయగా.. చివర్లో వచ్చిన రింకూ సింగ్ ( 22 ) మ్యాచ్ కు ఫినిషింగ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

టీమిండియా రికార్డ్
అంతర్జాతీయ టీ20 లలో 200 స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా ఐదు సార్లు చేధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ లిస్ట్ లో టీమిండియా తరువాత సౌతాఫ్రికా నాలుగు సార్లు, పాకిస్తాన్ మూడు సార్లు, ఆస్ట్రేలియా మూడు సార్లు భారీ లక్ష్యాలను చేధించిన జట్లుగా ఉన్నాయి.

Also Read:తొలి టీ20లో టీమిండియా గెలుపు..

- Advertisement -