CM KCR:శ్రీనివాస్‌గౌడ్ గెలిస్తేనే మరింత అభివృద్ధి

45
- Advertisement -

మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని…ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి శ్రీనివాస్‌ గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన సీఎం..రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు. పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడిస్తూ అద్భుత ప్రగతి సాధించామన్నారు.

రైతు బంధు ఉండాలంటే శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలవాలన్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వేస్ట్ 3 గంటల కరెంట్ చాలంటున్నాడని…24 గంటలు ఉండాలంటే శ్రీనివాస్ గౌడ్ గెలవాలన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ఓటు తలరాతను మారుస్తుంది కాబట్టి ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేయాలన్నారు. మహబూబ్‌నగర్‌ను వలసల జిల్లాగా మర్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ధరణిని బంగాళాఖాతంలో వేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని వారినే బంగాళాఖాతంలో వేయాలన్నారు. ధరణి స్థానంలో భూమాతా అని తీసుకొస్తున్నారని అది భూమాత కాదు భూమేత అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 5వేల పెన్షన్ అందిస్తామన్నారు. రైతులను ఆదుకోవాలని రైతు బంధు, రైతు భీమా తెచ్చామన్నారు. మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి శ్రీనివాస్ గౌడ్ విశేష కృషి చేశారన్నారు. బైపాస్ రోడ్డు అద్భుతంగా ఉందని..కేసీఆర్ పార్కు అద్భుతంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న ఎకో పార్కు ఏ జిల్లాలో లేదన్నారు. మహబూబ్‌నగర్‌కు ఐటీ టవర్‌ తీసుకొచ్చారని, అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ వచ్చిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చారన్నారు.

Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?

- Advertisement -