వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్ లో నిరాశ పరిచిన రోహిత్ సేన. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ లో ఎదురైన పరాభవం నుంచి తెరుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన లోపాలను బయట పెడుతూ రోహిత్ శర్మ వైపు వేలెత్తి చూపిస్తున్నారు కొందరు. ఫైనల్ లో రోహిత్ శర్మ కేర్ లెస్ గా వ్యవహరించారని, ఫీల్డింగ్ సెట్ చేయడంలో కూడా హిట్ మ్యాన్ విఫలం అయ్యాడని ఇలా రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే వాదనకు పెరుగుతోంది. నిజానికి రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో మంచిగానే రాణించారని చాలా మంది అభిప్రాయం. రోహిత్ కెప్టెన్సీ వల్లే వరల్డ్ కప్ లో టీమిండియా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిందని చెబుతున్నారు.
అయితే వచ్చే వరల్డ్ కప్ నాటికి రోహిత్ జట్టులో ఉంటాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చాలా మంది అభిప్రాయం. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ తరువాత వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. కానీ రోహిత్ మాదిరి సమయానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, జట్టును ముందుండి నడిపించడం వంటి వాటిలో కేఎల్ ఇంకా పరిణితి పొందాల్సివుంది. ఇక హర్డిక్ పాండ్య కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. అయితే మరో రెండేళ్ళు రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్ గా ఉంటే మేలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జట్టు ఎంతో పటిష్టంగా అన్నీ విభాగాల్లోనూ రాణిస్తోంది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుడ్ బై చెబితే ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని, అందువల్ల వారి ఆటతీరు దెబ్బ తినే అవకాశం ఉందనేది విశ్లేషకుల చెబుతున్నారు. అందుకే మరో రెండేళ్లు అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ నే కెప్టెన్ గా ఉండాలనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం.
Also Read:Venkatesh: నెక్ట్స్ వరల్డ్ కప్ మనదే