Congress:కాంగ్రెస్ కు ఆ సత్తా ఉందా?

60
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేల అమలుకు సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ ఎండమావులను నీటి జాడలు గా చూపించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్.. ఆ పార్టీ చేతగానితనాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ లక్ష్మి, మహాలక్ష్మి అంటూ కల్లబొల్లి మాటలతో హామీలు ప్రకటించి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. తీర గెలిచి అధికారం చేపట్టిన తరువాత ఆ రాష్ట్ర ప్రజలను మోచేతి నీళ్ళు తాగేలా చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బడ్జెట్ లేదని చేతులెత్తేస్తోంది. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కల్లబొల్లి కబుర్లు చెబుతూ అధికారం కోసం ప్రజలకు ఎరా వేసే ప్రయత్నం చేస్తోంది..

అయితే తెలంగాణలో పారదర్శకంగా అమలవుతున్న పథకాల విషయంలో మాత్రం నీళ్ళు నములుతోంది. కే‌సి‌ఆర్ పాలనను ఇరుకున పెట్టేందుకు రకరకాల విమర్శలు చేస్తున్నప్పటికి.. ఆ విమర్శలన్నీ తిరిగి ఆ పార్టీకే బల్లెం పోటు వేస్తున్నాయి. ముఖ్యంగా కరెంట్ విషయంలో పదే పదే కే‌సి‌ఆర్ సర్కార్ పై వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో 24 గంటల కరెంట్ అమలు కావడం లేదని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న కర్నాటకలో హస్తం పార్టీ 24 గంటల కరెంటు ఇస్తోందా అంటే అదీలేదు. కేవలం 5 గంటల కరెంటు ఆ రాష్ట్రంలో అరకొర ఇస్తున్నట్లు స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నా పరిస్థితి.

ఇక ధరణి విషయంలో కూడా ఇదే విధంగా విమర్శలు గుప్పిస్తూ రాజకీయ పబ్బం గడుపే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి ధరణి రద్దు చేస్తామని చెబుతున్నా హస్తం నేతలు.. ధరణి రద్దయితే రైతులను ఎలా ఆదుకుంటారనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి అధికారం కోసం నానా హడావిడి చేస్తున్న హస్తం పార్టీకి కే‌సి‌ఆర్ మాదిరి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చే సత్తా ఉందా అంటే ఆ హామీ విషయంలో రేవంత్ రెడ్డి తోక ముడుస్తున్న పరిస్థితి. ఇటీవల ఓ టీవి చానల్ ఇంటర్వ్యూ లో 24 కరెంట్ ఇస్తామని తాము ఎప్పుడు చెప్పలేదని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరెంట్ విషయంలో గాని, అభివృద్ది విషయంలో గాని రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సత్తా కాంగ్రెస్ కు లేదనేది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం హస్తం నేతలు చేస్తున్న హడావిడి అంతా తాటాకు చప్పుళ్లే తప్పా ఇంకోటి కాదని చెబుతున్నారు రాజకీయవాదులు.

Also Read:Bigg Boss 7 Telugu:నిన్న ఫ్రెండ్స్..ఇవాళ శత్రువులు

- Advertisement -