బిడెన్ – జిన్‭పింగ్ కలిశారు..

52
- Advertisement -

ప్రత్యర్థులైన అమెరికా – చైనా దేశాల అధ్యక్షులు కలిశారు. అభివృద్ధిలో పోటీ పడుతున్న ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎవరూ ఊహించని విధంగా కలిశారు. ఒకరికొరు షెక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే కాదు ఒక చేయి జిన్‭పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు బైడెన్.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ (APEC) సదస్సు ఇందుకు వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2021 జనవరి తర్వాత ఇరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా బిడెన్ తన ఎక్స్ ద్వారా స్పందిస్తూ…ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని చెప్పగా ఇద్దరం ప్రజల కోసం, ప్రపంచం కోసం, చరిత్ర కోసం భారీ బాధ్యతలను భుజాలకెత్తుకున్నాం అని చైనా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.

Also Read:CM KCR:నకిరేకల్ అభివృద్ధి బాధ్యత నాదే

- Advertisement -