Harishrao:కేసీఆర్ మాటంటే మాటే

47
- Advertisement -

కెసిఆర్ మాటంటే మాటే… అంటే చేసి చూపిస్తారన్నారు మంత్రి హరీశ్ రావు. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ లో నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడిన హరీశ్‌…వచ్చే ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నాం అన్నారు. నీళ్ళు, కరెంట్, ఆసుపత్రులు తెచ్చింది కేసీఆర్. రోడ్లు వేసి అభివృద్ధి చేసింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వేసిన రోడ్లకు గతుకుల వస్తె రేపు డాంబర్ కూడా వేయరు…కెసిఆర్ వచ్చాక భూముల విలువ పెరిగింది గజ్వేల్ రోల్ మోడల్ అయిందన్నారు.

భూములు గుంజుకుంటామని జూటా మాటలు చెబుతున్నారన్నారు. మోడీ సొంత రాష్ట్రంలో పింఛన్ ఇచ్చేది 600 అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చేది 600…అక్కడ ఇవ్వరు గానీ, ఇక్కడ పింఛన్లు ఇస్తారా అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా 2000 పించన్ ఇస్తున్నారో ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ రాకముందు గజ్వేల్ ఎలా ఉండే వచ్చాక ఎలా ఉందో మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు.

గోదావరి నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు కడిగింది వాస్తవం కాదా..కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కరెంటు కష్టాలు వస్తాయన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని…కేసీఆర్ ను దీవించాలి…. మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అన్నారు.

Also Read:క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా..’కోటబొమ్మాళి పీఎస్‌’

- Advertisement -