దీపికా మేడమ్ తల్లి ఎప్పుడవుతావ్?

53
- Advertisement -

పఠాన్, జవాన్ మూవీలతో భారీ విజయాన్ని అందుకుంది దీపికా పదుకొనే. తాజాగా నెపోటిజంపై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘బాలీవుడ్‌లో ప్రస్తుతం నేను నెంబర్ వన్ హీరోయిన్ని అంటున్నారు. ఐతే, నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నిజానికి బాలీవుడ్ లో ఇప్పటికీ నెపోటిజం ఉంది. టాప్ ఫిల్మ్ మేకర్స్ వారసులకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఎప్పుడూ బంధుప్రీతితో వ్యవహరించడం మానుకుంటే బాగుంటుంది. టాలెంట్ ఉన్న వారికి కూడా అవకాశాలు ఇస్తే మంచిది. గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. టాలెంట్ ఉన్నవారికే ప్రేక్షకులు కూడా మద్దతు పలుకుతున్నారు’ అని దీపికా పదుకొనే చెప్పుకొచ్చింది.

ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే మాట్లాడుతూ.. ‘కెరీర్ స్టార్టింగ్ లో నాకు మంచి పేరు వచ్చింది. ఎన్నో బ్రాండ్స్ కి యాడ్స్ కూడా చేశాను. నేను ఇక్కడ ఎదగలేనని, ప్యారిస్, న్యూయార్క్ కి వెళితే బాగా స్థిరపడతానని నా మెంటార్స్ నాకు ఎన్నో సార్లు చెప్పారు. అయినా, గ్లోబల్ స్టార్ కావాలంటే దేశాన్ని విడిచి ఎందుకు వెళ్లాలి ?, నేను నా దేశంలో ఉండే గ్లోబల్ స్టార్ గా మారతాను’ అని దీపికా పదుకొనే చెప్పుకొచ్చింది.

ఇక బాలీవుడ్ లో దీపికా పదుకొనే వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్చాట్ నిర్వహించింది. ఆమె అభిమాని ఒకరు ‘మీరు పెళ్లి చేసుకున్నారు. మరి మేడమ్ ఇంకా ఎందుకు మీరు తల్లి కాలేదు. ఎందుకు పిల్లలను కనలేదు’ అన్న ప్రశ్నకు’.. అవును నేను పిల్లలను ఇంకా కనలేదు. కానీ నా ప్రొఫెషనే నేను నా కిడ్ లా చూస్తున్నా’ అని దీపికా పదుకొనే బదులిచ్చింది.

Also Read:Harishrao:ఎన్నికల్లో గెలవగానే సన్నబియ్యం

- Advertisement -