పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనందరికి తెలిసిందే. తన పిల్లల గురించిన విషయాలే కాక పవన్‌కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తుంది రేణూ. ఈ సందర్భంలో కొందరు వ్యక్తులు తన పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తాజాగా తాను పోస్ట్ చేసిన వీడియో కరెక్ట్ సమాధానం ఇస్తుందని రేణూ తెలిపింది. కనీసం ఈ వీడియో చూసాక అయిన వారు మారతారనే ఆశాభావం వ్యక్తం చేసింది రేణూ. రేణూ దేశాయ్ పోస్ట్ చేసిన వీడియోలో ఆమె మాటల్లో ఏముందంటే..
ప్రపంచంలో అందరు పవన్ పిక్ పెట్టుకోవచ్చు నేను ఎందుకు పెట్టుకోకూడదు అని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేస్తున్నాంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నానని నాకు పబ్లిసిటీ కావాలంటూ ఫైర్ అయింది. పవన్‌కి తాను 11 సంవత్సరాలు భార్యగా, 17 సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నట్టు తెలిపింది. తాను పెట్టిన టీ అంటే పవన్‌కి చాలా ఇష్టమని కూడా తెలిపింది రేణూ. అసలు నేను పవన్ గురించి ఎందుకు మాట్లాడకూడదు.
డైవర్స్ పేపర్ మీద సైన్ చేయగానే మా మధ్య రిలేషన్ పోయినట్టేనా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, అప్పుడప్పుడు ఆయన పిల్లలని చూడడానికి పూణె కూడా వస్తుంటారు. ఇకపై పవన్‌కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తాను , ఆయన గురించి మాట్లాడతాను నచ్చితే చూడండి లేదంటే మానేయండి. ఆయనకు లేని ప్రాబ్లమ్ మీకెందుకు అన్నట్టు ఇన్ డైరెక్ట్‌గా కొన్ని చురకలు కూడా అంటించింది.
విడిపోయినా తాను, పవన్ కళ్యాణ్ స్నేహితులు మాదిరే ఉంటామని, రోజూ ఫోన్లో మాట్లాడుకుంటామని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. తమ పిల్లల పట్ల ఇద్దరం ప్రేమగా ఉంటామని, పవన్ కూడా నిత్యం పిల్లల గురించి శ్రద్ద తీసుకుంటారని ఆమె చెప్పారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయం పవన్‌కు తెలుసునని కూడా ఆమె అన్నారు. మా వివాహం సఫలం కాకపోవచ్చు… కానీ, పరస్పరం గౌరవించుకుంటామని, పవన్ అంటే తనకు అభిమానమని ఆమె చెప్పారు. ఎక్కడైనా అబ్యంతర వ్యాఖ్యలు వచ్చినా, పట్టించుకోవద్దని పవన్ చెప్పారని ఆమె వివరించారు. అంతేకాదు..”కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది రేణూ. అయితే ఇలా ఫోటోలను పంచుకోవడం వల్ల మళ్లీ పవన్ కళ్యాణ్ – రేణు కలవబోతున్నారా..! లేక పవన్‌ను మరచిపోలేకనే ఇలా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుందా..? లేక పవన్ కళ్యాణ్‌ను వాడుకొని ఇలా రేణు పబ్లిసిటీని సంపాదించుకుంటుందా…? అని రకరకాలుగా కామెంట్స్ రావడంతో రేణు ఆ వార్తలపై తనదైన శైలిలో స్పందించింది.
మరి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.